వరంగల్ టైమ్స్, విశాఖపట్టణం జిల్లా: విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొని, రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం వేద పండిత సభలో పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు. శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవంలో డిప్యూటీ సీఎం (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Home News