వరంగల్ అర్బన్ జిల్లా: అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (AASRAA) స్వచ్ఛంధ సంస్థ తయారుచేసిన బ్రోచర్ ను వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈనెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవంను పురస్కరించుకుని నిర్వహించే ర్యాలీకి మేయర్ కు ఆహ్వానం పలికారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఆస్ రా సేవ సంస్థ వారు ఎంతగానో కృషి చేస్తున్నారని మేయర్ గుండా ప్రకాశరావు అన్నారు. ఇప్పటివరకు సుమారు 175 కేసులలో వినియోగదారుల పక్షాన పోరాడి 150 కేసులలో విజయం సాధించడం వారి సేవా స్ఫూర్తికి నిదర్శనం అని ఆయన తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందించడం హర్షణీయం అని, వినియోగదారుల రక్షణ చట్టం-1986, కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ(సి.సి.డి.ఏ) లు హింసను అరికట్టడంలో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ బాద్యులు ఈ నెల 24 న వినియోగదారుల చైతన్యం కోసం నిర్వహించనున్న ర్యాలీ లో పాల్గొనాలని మేయర్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్లా స్వామి, ఆస్ రా జిల్లా అధ్యక్షులు పాసికంటి సతీష్ కుమార్, కార్యదర్శి అనిశెట్టి మురళి, సభ్యులు అనిల్, మహేందర్, నవీన్ కుమార్, కిరణ్ రాజ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.