నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదు మేరకు 5వ టౌన్ పోలీసులు అరవింద్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబర్ 31న హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు సమీపంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎంపీని చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తులు చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని సాయి పేర్కొన్నారు.