న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగల సందర్భంగా మంగళవారం నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులు మారుతుంటాయి. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రంలో థాయ్ పూసం మురుగన్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
కానీ అసోం రాష్ట్రంలో అదే రోజు బ్యాంకులు పనిచేస్తాయి. అలా రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవులు మారుతూ ఉంటాయి. జనవరి 11వతేదీన మిషనరీ డే, జనవరి 12వతేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జనవరి 14వతేదీన మకర సంక్రాతి, జనవరి 15వతేదీన మకర సంక్రాంతి పండుగ,మాఘే సంక్రాంతి,పొంగల్, తిరువళ్లువర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 16వతేదీన ఆదివారం సెలవు. అన్ని బ్యాంకులు నిర్దిష్ట రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు ఆయా రాష్ట్రాల సెలవుల నోటిఫికేషన్లపై ఆధారపడి ఉంటాయి. జనవరి 11,12, 14,15,16 తేదీల్లో ఐదురోజుల పాటు సెలవుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. కాని ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.