ఎండ నుంచి కాపాడుకోవడానికి మన చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకుంటాం. కానీ చలికాలంలో సన్‌స్క్రీన్‌తో పనేంటి అనుకుంటే పొరపాటు చేసినట్లే అంటున్నారు చర్మవాధి వైద్యులు. నిజానికి సన్‌స్క్రీన్ ఎండలో బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాసుకోవాలట. సన్‌స్క్రీన్ లోషన్ మన చర్మానికి ఒక రక్షణ పొరలా పనిచేస్తుందని తెలిపారు. ఇది కేవలం సూర్యుని నుంచి వచ్చే కిరణాల నుంచే కాక.. దుమ్ము, ధూళి, మురికి, పొగ, పొల్యూషన్ లాంటివి చర్మంలోకి ప్రవేశించకుండా ఆపుతుందని సూచించారు. ఫలితంగా చర్మసమస్యలు దరిచేరవని తెలిపారు. అలాగే లోషన్ రాసుకోవడం వల్ల యవ్వనంగా కనబడుతారన్నారు. చర్మంపై ముడుతలు, చారలు రాకుండా కాపాడుతందన్నారు. సూర్యుడి వేడి తగిలినప్పడు చర్మం నల్ల బడకుండా కాంతివంతంగా మారుతుందని చెప్పారు.