హనుమకొండ జిల్లా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేడు హనుమకొండ చౌరస్తాలోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. రావు పద్మతో పాటు జిల్లా నాయకులు దేశినీ సదానందం గౌడ్, అర్.పి.జయంత్ లాల్, గండ్రతి శ్రీనివాస్, కేతిరెడ్డి విజయలక్ష్మీ, రవీందర్ రెడ్డి, గంట దేవేందర్ రెడ్డి, కళ్యాణ్, కొలగని నిరంజన్, వెన్నపురెడ్డి జగన్, హరిబాబు, మధుచందర్, తరుణ్, తుమ్మ శోభన్, కల్లూరి పవన్, శ్రీకాంత్, నర్సింహ, రిషివర్ధన్, మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నేతాజీకి నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటపటిమను రావు పద్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహనీయుడు సుభాష్ చంద్రబోస్ ని యువత ఆదర్శంగా తీసుకుని, అవినీతి రహిత సమాజంలో పాలుపంచుకోవాలని రావు పద్మ కోరారు.
Home United Warangal