వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టిన అనంతరం బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి రావు పద్మ మరియు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్. గుండె విజయ్ రామరావు బీజేపీ జిల్లా ఇంఛార్జి డాక్టర్.వి.మురళీధర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశినీ సదానందం గౌడ్, కొండి జితేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీరాం రెడ్డి, మొగిలి, నవనగిరి నిర్మల, జిల్లా కార్యదర్శి గురిజల వీరన్న, మాచర్ల కుమారస్వామి, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్, మహిళ మోర్చ అధ్యక్షురాలు కేతిరెడ్డి విజయలక్ష్మి, ఐటీ సోషల్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ తోపుచెర్ల మధుసూధన్, జిల్లా నాయకులు చందుపట్ల రాజీరెడ్డి, వీసం రమణ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
Home United Warangal