హైదరాబాద్: తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కాషాయ దళం అదే ఊపును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ను ఇప్పటికే నూతన అధ్యక్షుడిగా నియమించింది. అనంతరం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సంజయ్ తన కొత్త టీమ్‌ను నియమించారు. 8 మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా, నలుగురిని ప్రధాన కర్యదర్శులుగా, మరో ఎనిమిది మందిని కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు ఆదివారం బండి సంజయ్ నూతన కమిటీని ప్రకటించారు.
23 మందితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటిని ప్రకటించిన బండి సంజయ్
8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో కమిటి
కమిటిలో నలుగురు ప్రధాన కార్యదర్శులు
బీజేపీ రాష్ట్ర కమిటిలో ఆరుగురు మహిళలకు చోటు
ఉపాధ్యక్షులు:
విజయరామారావు,
చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావు,
యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్,
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,
మనోహర్‌రెడ్డి,
బండారు శోభారాణి
ప్రధాన కార్యదర్శులు:
ప్రేమేందర్‌రెడ్డి,
దుగ్యాల ప్రదీప్ కుమార్,
బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు
కార్యదర్శులు:
రఘునందన్‌రావు,
ప్రకాశ్‌రెడ్డి,
శ్రీనివాస్‌గౌడ్,
బొమ్మ జయశ్రీ,
పల్లె గంగారెడ్డి,
కుంజా సత్యవతి,
మాధవి,
ఉమారాణి
ట్రెజరర్:
బండారి శాంతికుమార్,
బవర్లాల్ వర్మ (జాయింట్ ట్రెజరర్)
ఆఫీస్ సెక్రటరీ: ఉమా శంకర్
బీజేపీ అనుబంధ సంఘాలు
1. యువ మోర్చా- భాను ప్రకాష్
2. మహిళ మోర్చా – గీత మూర్తి
3. కిషన్ మోర్చా – కొండపల్లి శ్రీధర్ రెడ్డి
4. ఎస్సీ మోర్చా – కొప్పుల బాషా
5. ఓబీసి మోర్చా- అలె భాస్కర్..
6. మైనార్టీ మోర్చా – ఆస్ఫర్ పాషా..
అధికార ప్రతినిధులు
కృష్ణ సాగర్ రావు
రజిని కుమారి
రాకేష్ రెడ్డి