వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ : బండి

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ : బండివరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా, లేరా ? అనే సందేహం వస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలకు బండి సంజయ్‌ హాజరయ్యాడు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలి. బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం కోసమా, తెలంగాణ ప్రజల కోసమా అని ఆరోపించారు.