హిసార్ : హర్యానాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మైనింగ్ నిర్వహిస్తున్న వాహనాలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఎంతమందికి ప్రాణనష్టం జరిగిందో తెలియరాలేదు.
మైనింగ్ కార్యక్రమాల్లో డజన్ల సంఖ్యలో వాహనాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. బివాని జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న దాదమ్ మైనింగ్ జోన్ లో ఈ ఘటన జరిగింది. సుమారు 15 మంది ఆచూకీ లేనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వాహనాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. చత్తీస్ ఘడ్ , రాజస్థాన్ కు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.