కశ్మీర్ : జమ్మూకశ్మీర్ లోని ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హై అలర్ట్ లో ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా సంఘ విద్రోహ శక్తులు దాడుకలు పాల్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో భారీ నిఘా పెట్టినట్లు ఇన్ స్పెక్టర్ జనరల్ డీకే బూరా తెలిపారు. రెండు వారాల పాటు సరిహద్దుల్లో గస్తీ తీవ్ర స్థాయిలో ఉంటుందని ఇప్పటికే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
జమ్మూ ఫ్రంటియర్ లో ఉన్న ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద యాంటీ టన్నెల్ ఆపరేషన్స్ చేపట్టినట్లు డీకే బూరా తెలిపారు. ఎటువంటి ఉగ్ర చర్యను అడ్డుకోవడానికైనా బీఎస్ఎఫ్ రెడీగా ఉందన్నారు.