ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆరంభంలోనే టీం ఇండియా వికెట్ కోల్పోయింది. నైట్ వాచ్ మెన్ గా బరిలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్ లోనే ఔటయ్యాడు. దీంతో భారత్ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తొలుత మిచెల్ స్టార్క్ తొలి ఓవర్ బౌలింగ్ చేయగా, మయాంక్ ఒక బౌండరీ కొట్టాడు. అనంతరం కమిన్స్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసున బుమ్రా ఆరో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.