కృష్ణమోహన్ రెడ్డిపై ముగిసిన సీబీఐ విచారణ
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
ఇటీవల ఎంపీ అవినాశ్ ను ప్రశ్నించిన సీబీఐ
అవినాశ్ కాల్ డేటా ఆధారంగా కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు నోటీసులు
కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో 6.30 గం.ల పాటు విచారణ
వరంగల్ టైమ్స్, కడప జిల్లా : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లపై సీబీఐ విచారణ ముగిసింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో దాదాపు ఆరున్నర గంటల పాటు సీబీఐ విచారణ జరిగింది. తొలుత కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు, ఆ తర్వాత నవీన్ ను ప్రశ్నించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా వీరిద్దరినీ ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. కాగా, నవీన్ ను రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ హైదరాబాదు కార్యాలయంలో విచారించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాశ్ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.