వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: మాతృభూమి కోసం అవసరమైతే ప్రాణాలర్పించినా తప్పులేదని చాటిచెప్పిన వీరుడు ఛత్రపతి శివాజీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శ్రీమహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పరిధిలోని పోతరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశాన్ని ప్రేమించాలి, ఆడవారిని గౌరవించాలి, మాతృభూమి కోసం అవసరమైతే ప్రాణాలర్పించినా తప్పులేదని చాటిన వీరుడుగా పేరు గాంచిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని చల్లా ధర్మారెడ్డి అని అన్నారు. హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ అని ఎమ్మెల్యే చల్లా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.