అమరావతి : భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీజేఐ రాక సందర్భంగా అధికారులు, పోలీసు యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాట్లను చేసింది. సీజేఐ నేడు, రేపు విజయవాడలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.