హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబసమేతంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11.10 గంటల సమయంలో బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి ఎస్ఆర్ఎం హోటల్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో రంగనాథస్వామి వారిని దర్శించుకుంటారు.
ఆ తర్వాత విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి చెన్నైలోనే బస చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరుసటి రోజు డిసెంబర్ 14 మంగళవారం తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ తో భేటీ కానున్నారని సమాచారం.
యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్ ను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే యాదాద్రి పునర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.