హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రుళ్లు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాధారణం గా ఉదయం కంటే రాత్రి సమయాల్లోనే చలి తీవ్రత ఎక్కువ గా ఉంది. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. వచ్చే వారం రోజులు పాటు సాధారణం కంటే సుమారు 5 నుంచి 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పడి పోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం కూడా ఉష్ణోగ్రతలు భారీగా నే పడిపోతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పడిపోయి ప్రజలను గజ గజ వణికిస్తుంది. శుక్రవారం ఉదయం అత్యల్పంగా తెలంగాణలోని కుమురం భీం జిల్లాలోని గిన్నెధరిలో 8 డిగ్రీలు నమోదైంది. అలాగే హైదరాబాద్ లో కూడా 13 డిగ్రీలు మాత్రమే నమోదైంది. అయితే ఒక రోజులో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.