హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంలో టీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నాయకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఎన్నికల అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడిన వీడియోలను హుజురాబాద్ ఎన్నికల సందర్బంగా వైరల్ చేయడం పై ఫిర్యాదు చేశారు.
ఆర్ముర్ కమల దళం పేరుతో బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నాయకులు క్రిశాంక్, జగన్ దినేష్ లు కోరారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ వీడియోలు చేసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.