హనుమకొండ జిల్లా : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలోని దేవాలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాజీపేటలోని అభయాంజనేయస్వామి దేవాలయం, శ్వేతార్క మూల గణపతి ఆలయాల్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి-సుజాత దంపతులు కాజీపేటలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అభయాంజనేయస్వామి దేవాలయం, శ్వేతార్క మూలగణపతి ఆలయ సన్నిధిలో జంగా రాఘవరెడ్డి దంపతులిద్దరూ ఆసీనులయ్యారు.
కాజీపేట జూబ్లీ మార్కెట్ ప్రాంతంలోని శ్రీఅభయాంజనేయ స్వామి, శ్వేతార్క మూలగణపతి ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వావి సన్నిధిలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి దంపతులతో పాటు కుటుంబసభ్యులు ఉత్తరద్వార దర్శనం, ఉత్సవ మూర్తికి అభిషేకం, అలంకరణ, ఆకు పూజ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ భక్తిభావాన్ని పెంచుకొని పండుగ సందర్భాల్లో తప్పకుండా దేవాలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకోవాలని జంగా రాఘవరెడ్డి అన్నారు. భక్తిభావంతో ఉన్నవారికి ఏకాగ్రతతో పాటు మనసు నిశ్చల స్థితిలో ఉండి ఏ ఆటంకాలు కలగకుండా ఉంటాయని తెలిపారు.
దైవ సన్నిధిలో ఆలయ కమిటీ మరియు పూజారి జాగర్ల అధ్యక్షులు శ్రీనివాస్ అయ్యగారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు కోటేశ్వర్, బోయిని కుమార్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు సందెల విజయ్ కుమార్, వసుకుల శంకర్, బైరి వరలక్ష్మి, లింగమూర్తి, డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.