బీఆర్ఎస్లోకి ఊపందుకున్న కాంగ్రెస్ చేరికలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమనికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రులు.
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి, సీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపారని కాంగ్రెస్ నేతలు కొనియాడారు.సీఎం కేసీఆర్ విధివిధానాలకు ఆకర్షితులమై తాము బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.పార్టీలో చేరిన వారిలో గీసుకొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్, రాంపూర్ సర్పంచ్ గాజర్ల గోపి, మచ్చాపూర్ మాజీ సర్పంచ్ నమిండ్ల మానస, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలబోయిన గోవర్ధన్, పొలబోయిన శ్రీనివాస్, కందికొండ రాజు, ఇట్టారి గురువయ్య, యూత్ లీడర్లు పొలెబోయిన సంపత్, గాజర్ల రంజిత్, పేర్ల శ్రవణ్, మంద అనిల్, పులి నాగేశ్, దండబోయిన సుమన్, పొలెబోయిన రాము తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కుమార్,గీసుగొండ మండల అధ్యక్షులు వీరగోని రాజకుమార్,జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు,పుండ్రు జైపాల్ రెడ్డి,జూలూరి లెనిన్,యాత్ర బాలకృష్ణ,రౌతు యుగేందర్,తదితరులు పాల్గొన్నారు.