ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గం నారాయణ పురం గ్రామంలో 250 పడకల శ్రీ షిరిడీ సాయి ఆసుపత్రి (షిర్డీ సాయి జన మంగళం ట్రస్ట్) నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ,కొవిడ్ కేసులపై ఏఎన్ఎం ,అంగన్ వాడీ కార్యలర్తలను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు.