కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి 27,28న కౌన్సిలింగ్
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ
ఈ నెల 27,28న వెబ్ కౌన్సిలింగ్
అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
మొదటి విడత వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ జారీ
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటి సీట్ల భర్తీకి కాను ఈ నెల 27, 28న మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు శనివారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 27 న ఉదయం 8 గంటల నుంచి 28 న సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదే విధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.