ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ” కరోనా లక్షణాలు ఉండటంతో నేను వెంటనే కరోనా టెస్ట్ చేయించుకున్నా. రిపోర్ట్ లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యా. గత కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన వాళ్లు వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి.. ” అంటూ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
Home News