భారత్ బ్లైండ్ టీంకే దక్కిన టీ20 వరల్డ్ కప్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ లో 120 పరుగుల తేడాతో విజయం సాధించి టీ 20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. టీ 20 వరల్డ్ కప్ ను వరుసగా మూడోసారి టీమిండియా ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసింది. అనంతరం 278 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 157 పరుగుల వద్దే కుప్పకూలింది.
దీంతో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టు పై 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. గతంలో 2012, 2017 వరల్డ్ కప్ లను సొంతం చేసుకున్న టీమిండియా వరుసగా మూడోసారి కూడా టైటిల్ విన్నర్ గా నిలిచి రికార్డు సృష్టించింది. అంధుల టీ 20 వరల్డ్ కప్ ను మూడోసారి దక్కించుకున్న భారత జట్టుపై తాజా, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.