హైదరాబాద్ : తెలంగాణలో నిజాయితీ పరుడైన పోలీసు అధికారిగా పేరున్న దాసరి భూమయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఉద్యమ కారుడిగా, పోలీసు అధికారిగా ప్రజలకు సుపరిచితుడైన భూమయ్య టీఆర్ఎస్ లో చేరడంతో హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్న టీం పేరుతో ఏర్పాటైన రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ సంఘం కన్వీనర్‌గా భూమయ్య వున్నారు. తీన్మార్ మల్లన్న అసలు స్వరూపం తెలిసిన దాసరి భూమయ్య టీఆర్ఎస్ లో చేరడం గమనార్హం.