సిడ్నీ: భారత్‌తో మూడో వన్డేకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నట్లు సమాచారం.
ఆదివారం భారత్‌తో జరిగిన సెకండ్ వన్డేలో వార్నర్ గాయాల బారిన పడ్డాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో శిఖర్ ధావన్ వేసిన బంతిని ఆపే ప్రయత్నంలో వార్నర్ నొప్పితో బాధపడ్డాడు. గజ్జల్లో తగిలిన గాయంతో అతను నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చివరకు ఫిజియో, మాక్స్వెల్ సాయంతో కుంటుతూనే మైదానం నుంచి బయటకు వెళ్లాడు. మెరుగైన చికిత్స నిమిత్తం అయనను దవాఖానకు తీసుకెళ్లారు. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ మాట్లాడారు. వార్నర్ ఫిట్నెస్ ఎలా ఉందో ఇంకా ఏమీ తెలియదని అతడు తరువాత మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని అనుకోవడంలేదని తెలిపారు. ఓపెనర్‌గా జట్టుకు వార్నర్ మంచి శుభారంభం అందించారని ఫించ్ తెలిపారు. ఆఖరి మూడో వన్డే బుధవారం కాన్బెర్రాలో జరగనుంది.