ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్

ఢిల్లీలో కొవిడ్ విజృంభిస్తోన్న దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగుల్లో 50శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ సంస్థల్లో కూడా వీలైనంత తక్కువ మంది ఆఫీసులకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. గ్రేడ్-1 అధికారులతో కార్యాలయాలు పనిచేస్తాయని సీఎం ప్రకటించారు. ఈ ఆదేశాలు డిసెంబర్ 31వరకు కొనసాగుతాయని కేజ్రీవాల్ వెల్లడించారు.