హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాల మళ్లింపు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాలను మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు అధికారులు మళ్లించారు. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగుళూరుకు మళ్లించారు.గచ్చిబౌలి, షేక్‌పేట్, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, ఉప్పల్‌లో వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.