రూ. 80 కోట్ల విలువ చేసే కొకైన్ పట్టివేత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 80 కోట్ల విలువ చేసే 8 కేజీల కొకైన్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సూట్ కేసుల్లో ఈ కొకైన్ ను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు.టాంజానియా దేశస్థుడు బిజినెస్ వీసా ద్వారా కేప్ టౌన్ నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు. మరో మహిళ ప్రయాణికురాలు టూరిస్ట్ వీసా ద్వారా అంగోలా నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్ కు చేరుకుంది. వీరిద్దరి వద్ద 4 కేజీల చొప్పున కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.