హైదరాబాద్ : హైదరాబాద్ సిటీలో భారీగా డ్రగ్స్ పడ్డుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ , వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో ముగ్గురు సభ్యుల ముఠాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
వారి నుంచి లభించిన కొకైన్, ఎల్ ఎస్డీ , మత్తు పదార్థాలను సీజ్ చేశారు. నూతన యేడాది వేడుకలకు ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతను అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మధ్యాహ్నం 12 గంటలకు మీడియాకు తెల్పనున్నారు.