ఖమ్మంలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది.కరోనా రోగి నుంచి మరో 8 మందికి వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి కుటుంబంలోని ముగ్గురికి కరోనా వ్యాప్తి చెందగా..రోగి దుకాణంలో పనిచేసే మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.