హైదరాబాద్ : సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ముగ్గులు వేసి వివిధ రంగులు, రేగు పండ్లు, కూరగాయలు, చెరుకుగడలతో అలంకరించారు. రంగవల్లుల మధ్యన పొంగల్ వండి సంక్రాంతి శోభను కన్నులను కట్టినట్లుగా చూపించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలు, రైతులు, పాడిపంటలు, సిరి సంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Home News