ఉద్యోగుల సొంతింటి కల నెరవేరనుంది: బొప్పరాజు

ఉద్యోగుల సొంతింటి కల నెరవేరనుంది: బొప్పరాజుఅమరావతి : రెండు వారాల్లో హెల్త్‌ కార్డుల సమస్య పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఉద్యోగుల సొంతింటికల నెరవేర్చేలా సీఎం నిర్ణయం తీసకున్నారు. స్మార్ట్‌ సిటీలో ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి 20శాతం రాయితీ ఇస్తామన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఒకటో తేదీకే జీతాలు ఇస్తామన్నారు. సీపీఎస్‌ అంశంపై టైమ్‌ బౌండ్‌ ప్రకటించారు. ఫిట్‌ మెంట్‌ సమస్య మినహాయిస్తే మిగిలిన అన్ని సమస్యలపై సీఎం టైమ్‌ బౌండ్‌ ప్రకటించడం మంచి నిర్ణయమే’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.