పునీత్ ‘జేమ్స్’ ట్రేడ్‌మార్క్ సాంగ్‌కు ఫుల్ రెస్పాన్స్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ చిత్రంలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో, మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతోన్న ఈ చిత్రం కూడా అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్.సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.
నటీనటులు : పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్ : కిశోర్ ప్రొడక్షన్స్,
సంగీతం : చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ,
ఆర్ట్ : రవి శాంతేహైక్లు,
పీఆర్వో : బి. వీరబాబు
ఎడిటింగ్ : దీపు ఎస్ కుమార్,
నిర్మాత : కిశోర్ పత్తికొండ,
దర్శకత్వం : చేతన్ కుమార్.