ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మహిళల ఆర్థికంగా ఎదగలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు వేల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉచితంగా కుట్టుమిషీన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్క మహిళకు రూ.17వేలు ప్రభుత్వం నుండి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పాలకుర్తి నుండే ఈ స్కీంను ప్రారంబింస్తున్నామని పేర్కొన్నారు.