ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎస్ .కృష్ణ ఆదిత్య అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ ప్రభాకర్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ములుగు జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు.కరోన సమయంలో కృషి చేసిన జిల్లా కలెక్టర్ ,ఎస్పీని, ఇతర పోలీసు అధికారులను ,పారిశుద్ధ్య కార్మికులను, వైద్యులను , ఆశా కార్యకర్తలను, ప్రతీ ఒక్కరిని ఈ సందర్భంగా అభినందించారు. లాక్ డౌన్ కి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.