కన్నీళ్లు పెట్టుకున్న ఏపీ మాజీ సీఎం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కంటతడిపెట్టారు. ఏపీ అసెంబ్లీలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, ఎమ్మెల్యేలు తీవ్రమైన పదజాలంతో దూషించడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.అసెంబ్లీలో తనకు ఎదురైన ప్రతికూలతలు, తనతో పాటు తన భార్యను వైసీపీ నేతలు దూషించడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిగత దూషణలు తననెంతో బాధించాయంటూ మీడియా సమావేశంలోనే చంద్రబాబు నాయుడు బోరున విలపించాడు. తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన వారికి రానున్న రోజులు సమాధానం చెబుతాయని తెలిపారు.