మాజీ ఎంపీ డీఎస్ కు తీవ్ర అస్వస్థత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డీఎస్ (డి.శ్రీనివాస్ ) సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు స్థానిక సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. డీఎస్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డీఎస్ గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.