90 నామినేషన్ల తిరస్కరణ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్ల పరిశీలనలో 90 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1893 మంది అభ్యర్థులు 2575 నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో నేడు జరిపిన నామినేషన్ల పరిశీలనలో 90 నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.
తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం బి.జె.పి నుండి 539 , సి.పి.ఐ నుండి 22, సి.పి.ఐ(ఎం) నుండి 19, కాంగ్రెస్ నుండి 348, ఎం.ఐ.ఎం నుండి 72, టి.ఆర్.ఎస్ నుండి 527 మంది, టి.డి.పి నుండి 202, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 143 , స్వతంత్రులు 613 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. కాగా రేపు, ఆదివారం, నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది.