అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగారాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు , నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమై గిన్నీస్ రికార్డులను తిరగరాసింది. పాత రికార్డు 10500 యూనిట్లు ఉండగా ఆ రికార్డును తిరగరాస్తూ సీఎం జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు 18000 యూనిట్లు రక్తదానం చేసి గిన్నీస్లో ఉన్న పాత రికార్డును దాటి కొత్త రికార్డును నెలకొల్పారు. అలాగే క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు అశీర్వచనం ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.