అమరావతి: అగ్రిగోల్డ్ లో రూ .20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది . ఇందులో భాగంగా ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా చర్యలు చేపట్టింది. ఈ మొత్తం ప్రక్రియను మార్చి నాటికి పూర్తిచేసి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్ తెలిపారు . 10వేల లోపు డిపాజిట్ దారులకు ప్రభుత్వం రూ .264 కోట్లు ఇప్పటికే చెల్లించింది .