వరంగల్ అర్బన్ జిల్లా: ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాకే రాష్ట్రంలో ప్రతీ పండుగను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు అందిస్తుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఇందులో భాగంగా హన్మకొండ జెరూసలెం చర్చిలో తన నియోజకవర్గంలోని దాదాపు 500 క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అందించారు.క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.