పబ్లిక్ గార్డెన్ లో తుప్పుపట్టిన రివాల్వర్లు లభ్యం
వరంగల్ టైమ్స్, క్రైమ్ న్యూస్ : హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని శాసన మండలి (జూబ్లీ హల్) సమీపంలో తుప్పుపట్టిన రివాల్వర్లు దొరకడంతో కలకలం రేపింది. మండలి పక్కన ఉద్యానవన శాఖ సిబ్బంది పెరిగిన చెట్లను కట్ చేస్తుండగా…ప్లాస్టిక్ కవర్లలలో 3 రివార్వర్లు కనిపించాయి.
చెట్ల పొదలలో ఒక తపంచ, రెండు కంట్రీ మేడ్ రివాల్వర్లు దొరికాయి. వెంటనే సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…3 రివార్వర్ల ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెస్త్తున్నారు. నెల రోజుల క్రితం జాతీయ సమాఖ్య వారోత్సవాలో భాగంగా సెప్టెంబర్17న ముఖ్యమంత్రి కేసీఆర్ సంఘటన స్థలానికి పక్కన్నే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.