గ్రేటర్ వరంగల్ : ఆహ్వాన ముఖ ద్వారాల పనులు తక్షణమే పూర్తి చేయాలని జిడబ్ల్యూఎంసి కమిషనర్ పమేలా సత్పతి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం గ్రేటర్ వరంగల్ లో స్మార్ట్ సిటీ పథకం క్రింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. స్మార్ట్ సిటీ పథకం క్రింద చేపడుతున్న నర్సంపేట రోడ్ వద్ద రూ. 53 లక్షలతో వస్త్రం నమునాతో నిర్మిస్తున్న నగర ఆహ్వాన ముఖ ద్వారం పనులను, ఖమ్మం రోడ్ బొల్లికుంట జంక్షన్ వద్ద 1.7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాకతీయ తోరణం నమునాతో నిర్మిస్తున్న నగర ఆహ్వాన ముఖ ద్వార పనులను, ప్రాంతీయ గ్రంథాలయ నవీకరణ పనులు, పోతన జంక్షన్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఆహ్వాన ముఖద్వారాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోస్మార్ట్ సిటీ టీం లీడర్ ఆనంద్, బల్దియా ఈ.ఈ. లు విద్యాసాగర్, రాజయ్య, డి.ఈ. లు రవీందర్, మహేందర్, ఏ.ఈ. లు, తదితరులు పాల్గొన్నారు.