ఆన్లైన్లో ఇక ట్రేడ్ లైసెన్స్ దిద్దుబాట్లు
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ట్రేడ్ లైసెన్స్ మంజూరి నిమిత్తం సర్వే చేసిన దుకాణాలు ఏమైనా దిద్దుబాటు ఉన్నచో ఈనెల 28లోగా ఆన్లైన్లో సరి చేసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య ప్రకటనలో తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ కొరకు సర్వే చేసిన దుకాణాల యజమానులకు ఎస్ఎంఎస్, లింకు ద్వారా తెలియజేయడం జరిగిందని అన్నారు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెబ్ సైట్ లో ఉంచిన జాబితాలో సరి చేసుకోవాలన్నారు.
అదే విధంగా ట్రేడ్ లైసెన్స్ సర్వే జరిగి ఎస్ఎంఎస్ రాని దుకాణాదారులు www.gwmc.gov.in వెబ్ సైట్లో తిరిగి నమోదు చేసుకోవాలన్నారు. ఇంకా సర్వే జరగకుండా ఏమైనా దుకాణాలు మిగిలి ఉన్నట్లయితే ఆయా దుకాణాల యజమానులు వెంటనే www.gwmc.gov.in వెబ్ సైట్ లో ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ అప్లికేషన్ లోకి వెళ్లి నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే మార్చ్ 1 ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణాదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.