హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై నాచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు. టికెట్లు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమవుతుంది. థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణాకొట్టు కలెక్షన్లు ఎక్కువయ్యాయి. ప్రేక్షకులకు సినిమా చూపించడమే మా లక్ష్యం, లెక్కలు తర్వాత అని నాని పేర్కొన్నారు. అయితే నాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే ధరలు తగ్గించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలి. మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్కెట్ లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా. ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తాం. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా… మేమింతే, ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు.