సర్పంచ్ ల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో సర్పంచ్ ల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సర్పంచ్ లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సర్పంచ్ ల సభకు అనుమతిని ఇచ్చింది. సభలో 300 మందికి మించి ఉండకూడదని సూచించింది. అదే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు షరతు విధించింది.