ఢిల్లీ : భారత్ లోని నోయిడాలో ఉన్న ప్లాంటును మూసివేసే యోచనలో హోండా మోటార్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో కార్ల ఉత్పత్తిని 40శాతం మేరకు తగ్గించుకోవాలని భావిస్తోందట. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో అమ్మకాలపై ప్రభావం పడటమే ఇందుకు కారణమని నిక్కీ వార్తా పత్రిక కథనం పేర్కొంది. నోయిడాలో ప్లాంటు మూసివేసి టపుకరా ప్లాంటుకు తన ఉత్పత్తి కార్యకలాపాలను బదిలీ చేయాలని అనుకుంటోందని తెలిపింది. 1997లో ప్రారంభమైన నోయిడా ప్లాంటుకు ఏటా 1,00,000 వాహనాలను తయారు చేసే సామర్థ్యం వుంది. ప్లాంటు మూసివేత వార్తలపై స్పందించేందుకు కంపెనీ అధికార ప్రతినిధి నిరాకరించారు.