విశాఖ జిల్లా : విశాఖ ఉక్కు కర్మాగారం ఎంస్ఎంఎస్- 2 లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్ లాడిల్ తెగిపోవడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఉక్కు ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్టర్లకు గాయాలయ్యాయి. 20 టన్నుల ఉక్కు ద్రావణం నేలపాలైంది.గాయాలైనవారిలో నలుగురు ఉద్యోగుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ప్యాక్టరీ యాజమాన్యం హాస్పిటల్‌కు తరలించింది. కాగా సుమారు కోటి రూపాయల ఉక్కు ద్రావణం నేలపాలైనట్లు ప్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులు శోభన్‌బాబు, ఫైడర్నాయుడు, శ్రీనివాస్, మోహన్‌గా అధికారులు గుర్తించారు. కర్మాగారాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు