అసత్యాలు ప్రచారం చేస్తే..మీ సంగతి అంతే
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇలా చేస్తే పరీక్షలు రాయకుండా అభ్యర్థులపై నిషేధం విధిస్తామని సూచించారు.శనివారం ఓ పత్రిక ఇంటర్వ్యూలో జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. కమిషన్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తలపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులెవరూ ఆలోచించకుండా పోస్టులు పెట్టడం, ఎవరో పంపించినవి ఫార్వర్డ్ చేయరాదని సూచించారు.